ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:23 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మట్టి వినాయకుడిని పూజిద్దాం వాతావరణం సమతుల్యతను కాపాడుదాం టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి

మట్టి వినాయకుడిని పూజిద్దాం వాతావరణం సమతుల్యతను కాపాడుదాం టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి.

మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 13.

.వినాయక చవితి పర్వదినమును పురస్కరించుకొని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ,మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి వాతావరణ సమతుల్యత కాపాడాలని కోరారు.మంచిర్యాల జిల్లాలోని ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను రేపు ఇండ్లలో ప్రతిష్టించుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని భవిష్యత్తులో ఎటువంటి క్యాన్సర్ బారిన  ఇతర వ్యాధుల బారిన పడకుండా మన వంతు గా మట్టి వినాయకులను పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుల వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని క్యాన్సర్ బారిన పడుతున్నామని  అదేవిధంగా చెరువులు, నదులలో నిమజ్జనం చేయడం వలన చెరువులు,నదులు కలుషితం అవుతున్నాయని కావున మట్టి వినాయకులం పూజించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టీఎన్జీవో కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు కోశాధికారి సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ,తిరుపతి, రామ్ కుమార్, నరేందర్ సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు ,సభ్యులు తదితరులు పాల్గొన్నారు..